Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైట్‌హౌజ్‌లో తన చివరి మధురానుభూతుల్ని షేర్ చేసిన మిషెల్ ఒబామా!

అమెరికా 45వ అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మ‌రికొన్ని గంట‌ల్లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఒబామా దంప‌తులు శ్వేత‌సౌధాన్ని విడిచి వెళ్ల‌నున్నారు. ఈ సంద‌ర్భంగా బ‌రాక్‌ ఒబామా భార్య మిషెల్ ఒబామా త‌న చివ‌రి అనుభూతుల్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ ప‌లు ఫొటోల‌ను పోస్ట్ చేశారు. వైట్‌హౌజ్‌లో త‌న భ‌ర్త‌తో దిగిన చివ‌రి ఫోటోల‌ను షేర్ చేశారు. అమెరికా ఫ‌స్ట్ లేడీగా సేవ‌లు అందించ‌డం త‌న‌ జీవితంలో గొప్ప గౌర‌వంగా భావిస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు. శ్వేత‌సౌధంలో ఫ‌స్ట్ డాగ్స్ బో, స‌న్నీలతో గ‌డిపిన చివ‌రి క్ష‌ణాల వీడియోను ఆమె ప్ర‌జ‌లతో పంచుకున్నారు.






michel obama

More Telugu News